కాంగ్రెస్ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజరు..
హీట్ ఎక్కిస్తున్న మునుగోడు రాజకీయం
పార్టీ మార్పునకు మరింత బలం..
స్పాట్ వాయిస్ , నల్లగొండ: మునుగోడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. రోజుకో ట్విస్ట్ ఇస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో.. శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ , రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరు అయ్యారు. ఇప్పటికే వెంకట్ రెడ్డి సైతం పార్టీ వీడుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయన విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకాకపోవడం మరింత చర్చ కు దారితీసింది.
దూరం అందుకేనా…
రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించడంతో.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై వెంకట్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చండూర్లో జరుగుతున్న సమావేశానికి తాను ఈ భేటీకి దూరంగా ఉంటున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల కోసం గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన.. ఫైనాన్స్ కమిటీ సమావేశం దృష్ట్యా హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మునుగోడులో జరగనున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యనేతలతో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.
Recent Comments