స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ నిర్వహణ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బుర్ర రమేశ్ ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్, టీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సన్మానించారు. ఉచిత కోచింగ్ ముగింపు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జిల్లా నాయకులు, తన ఆత్మీయ మిత్రుడు బుర్ర రమేష్ కు ఏ బాధ్యత ఇచ్చిన నిబద్ధతతో, ప్రత్యేక శ్రద్ధతో విజయవంతంగా పూర్తి చేస్తారన్నారు. ముఖ్యంగా బుర్ర రమేష్ టెట్ విద్యార్థులను, గ్రూప్స్, ఎస్సై కానిస్టేబుల్ పోటీ పరీక్షల విద్యార్థులను కార్పొరేట్ ఇనిస్టిట్యూట్ వాతావరణం కల్పించి వారికి క్రమశిక్షణతో పాటు, ఎదుటివారిని ప్రేమభిమనాలతో గౌరవించే మంచి వ్యక్తులుగా తయారుచేశారని కొనియాడారు.
90 రోజులలో భారీ వర్షంలో సైతం పరీక్షలు నిర్వహించి వారి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలో ఆయన కృషి అభిననందనీయమని అన్నారు. గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. పోటీ పరీక్షల కోచింగ్ విజయవంతం రమేశ్ వల్లే సాధ్యమైందని కొనియాడారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రస్ట్ సేవలను అందరికి చేరువ చేయడంలో రమేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర బుర్ర రమేష్ ను శాలువాతో సత్కరించి, ఆయన టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఎసీఎస్ చైర్మన్ మేకల సంపత్, కౌన్సిలర్ శిరూప అనిల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, సీనియర్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, బుర్ర రమేష్, టీం సభ్యులు దేవర ముత్తు, గడ్డం రవి, సాయిల్ల రాము, జయంత్, నవీన్, శ్రీకాంత్ పటేల్, శివ, హరి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments