స్పాట్ వాయిస్, కేసముద్రం: పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన హబూబాబాద్ జిల్లాలో కేసముద్రం మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేసముద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు జాటోతు సమీరా 10 నిమిషాలు ఆలస్యంగా రాగా.. అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పరీక్ష రాయలేదని మనస్తాపం చెందిన సమీరా ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కాలేజీ సీఎస్ అజీజ్ బేగ్ మాట్లాడుతూ.. ఇంటర్ నిబంధనల మేరకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వమని తెలిపారు.
ఎగ్జామ్ రాయనివ్వలేదని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
RELATED ARTICLES
Recent Comments