టీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు ప్లాన్..!
పోలీసుల అదుపులో అనుమానితుడు..
స్పాట్ వాయిస్ , క్రైం: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యకు ప్లాన్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లో ఆయన ఇంటి వద్ద గుర్తుతెలియని ఒక వ్యక్తి తచ్చాడుతూ కనిపించాడు. సదరు వ్యక్తి వద్ద కత్తి, పిస్తోలు కూడా ఉండటంతో అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ సర్పంచ్ భర్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో సదరు నిందితుడు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక కత్తి, పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదురు వ్యక్తిని విచారిస్తున్నట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు.
Recent Comments