250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
స్పాట్ వాయిస్, గణపురం: నాటు సారా తయారీ స్థావరాలపై గణపురం పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం మండలంలోని బస్వరాజుపల్లి గ్రామ శివారులో నాటు సారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో ఎస్సై అభినవ్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే 250 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సారా తయారు చేయడం, అమ్మడం నేరమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి వివరాలను తెలియజేయాలని ఈ సంరర్భంగా ఎస్సై ప్రజలను సూచించారు.
Recent Comments