Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలుకరెంట్ కోసం రైతుల ధర్నా..

కరెంట్ కోసం రైతుల ధర్నా..

కొయ్యూరు సబ్ స్టేషన్ ఎదుట బైఠాయింపు..
11 కేవీ ఫీడర్ సమస్య పరిష్కారించాలని ధర్నా

స్పాట్ వాయిస్, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి, రుద్రారం 11 కేవీ విద్యుత్ లైన్ ఫీడర్స్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొయ్యూరు సబ్ స్టేషన్ ఎదురుగా రైతులు ధర్నా చేశారు. 15 రోజుల నుంచి విద్యుత్ అధికారులకు తమ గోడును తెలిపిన ఏ ఒక్క అధికారి స్పందించలేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎడ్లపల్లి , రుద్రారం ఫీడర్స్ సమస్యలతో ఈ ప్రాంత రైతులు వరి సాగు కోసం వేసిన మొలక నార్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట పొలాల్లో నాట్లు పెట్టిన రైతులు విద్యుత్ సమస్యల వలన నార్లు ఎండిపోతున్నాయని తెలిపారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఏ ఒక్క అధికారి, సిబ్బంది విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ అధికారులు ఎడ్లపల్లి, రుద్రారం 11 కేవీ లైన్ ఫీడర్స్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కొయ్యూరు, రుద్రారం, ఎడ్లపల్లి, శభాష్ నగర్, గట్టుపల్లి, శాలపల్లి, రాఘవయ్యపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments