Monday, April 7, 2025
Homeతెలంగాణఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పిలుపు..

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పిలుపు..

మరింత ఉత్కంఠంగా మునుగోడు రాజకీయం
స్పాట్ వాయిస్, నల్లగొండ: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి గురువారం కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ మార్పుపై తన అనుచరులతో కార్యకర్తలతో ఆయన చర్చిస్తున్నారు. అయితే రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధచేస్తోందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే హైకమాండ్ నుంచి ఆయనకు పిలుపురావడం వెనుక ఉన్న అర్థం ఏమిటో అంతుచిక్కడం లేదు.
బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సమావేశమై రాజగోపాల్‌ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత మేరకు ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకు ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments