17ఏళ్లు దాటితే ఓటు హక్కు..
స్పాట్ వాయిస్, బ్యూరో: యువతీయువకులు తమ ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస చెప్పింది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది. 18 ఏళ్లు పూర్తికాగానే.. వారికి ఓటు హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది. ఓటు హక్కు నమోదు కోసం ఏటా జనవరి ఒకటి వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని ఈసీ పేర్కొంది. ఓటు నమోదు చేసుకునేందుకు అర్హత తేదీ జనవరి 1తో పాటు ఇక నుంచి ఏప్రిల్ ఒకటి, జూలై ఒకటి, అక్టోబర్ ఒకటిని కూడా అర్హత తేదీలుగా గుర్తించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఓటరు జాబితా అప్‌డేట్ అవుతుందని వివరించింది. 17 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు సాంకేతికంగా తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
Recent Comments