స్పాట్ వాయిస్, హైదరాబాద్: భారీ వర్షాలకు విశ్వనగరం తల్లడిల్లుతోంది. భాగ్యనగరంలోని శివారు జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై నుంచి పరుగులు తీసింది. దీంతో మూసీ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. అధికారులు ఈ రెండు వంతెనలపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో మహానగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
Recent Comments