Sunday, November 24, 2024
Homeక్రైమ్భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!
మహబూబాబాద్ జిల్లాలో విషాదం..
మరిపెడ మండలం ఆనకట్ట తండాలో ఉద్రిక్తత
పోలీస్ ల లాఠీ ఛార్జ్..

స్పాట్.వాయిస్ , మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు ఆనకట్ట తండాలో మంగళవారం తెల్లవారు జామున బానోత్ మమత (28)ని భర్త బానోత్ రవి అత్యంత కిరాతకంగా గొడ్డలి లో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన మానుకోటలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన బానోత్ రవి,మమతకు ఆరు ఎండ్ల క్రితం వివాహం జరిగింది. భర్త రవి భార్య ను నిత్యం అనుమానిస్తూ వేధించేవాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున మమత ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు నిందితుడు రవి ఇంటిని తగుల బెట్టి , వస్తువులన్నీ ధ్వంసం చేశారు. మృతదేహాన్ని తరలిస్తున్న క్రమంలో అడ్డుకున్న పోలీస్ ల పై పరుష పద జాలం తో దూషించడం తో సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ నేతృత్వం లోని పోలీస్ లు లాఠీలకు పనిచెప్పారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments