2,440 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ శాఖల్లో ఖాళీలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 మంది జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇంటర్ విద్యలో 40 లైబ్రరీయన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్స్ట్రక్టర్లు, 31 లైబ్రరీయన్లు, 5 మాట్రన్, 25 ఎలక్ట్రిషీయన్లు, 37 పీడీ పోస్టులు, కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్ పోస్టులు, 24 లైబ్రరీయన్లు, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Recent Comments