‘ప్రజాగోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంపై ఎమ్మెల్యే పెద్ది
స్పాట్ వాయిస్, నర్సంపేట: ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమాన్ని చేపట్టే ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావుకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, సాగునీరు, పచ్చని పొలాలు, నిండిన చెరువులు, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పల్లెలు, వీటిని చూసేందుకా..? ఈ ప్రజాగోస యాత్ర అని ప్రశ్నించారు. మీ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్న గోసను కూడా ఇక్కడ ప్రజలకు ఒక్కసారి వివరించాలన్నారు. ఇక్కడున్న పింఛన్లు అక్కడ లేవని చెప్పాలని, ఇక్కడున్న 24 గంటల కరెంటు అక్కడ లేదని చెప్పాలని హితవు చెప్పారు. ఇక్కడ అన్ని కులాలు, మతాల వారు సోదరభావంతో కలిసి మెలిసి జీవిస్తుంటే, బీజేపీ ప్రభుత్వాలు ఏలుతున్న రాష్ట్రాల్లో కులమతాల గొడవలతో ప్రజలు కొట్టుకు చస్తున్నారని చెప్పాలన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నామని చెప్పాలని సూచించారు. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమైన మీ దద్దమ్మలైన ఎంపీల గురించి మాట్లాడాలని, కరోనాకాలంలో దేశ ప్రజలను చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించి దేశ సంపదను అంబానికి, ఆదానీకి తాకట్టు పెట్టామని, ప్రభుత్వ ఆస్తులను నిర్ధాక్షణంగా అమ్ముకున్నామని, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటించామని, జీఎస్టీ పేరుతో పసిపిల్లలు తాగే పాలపై సైతం టాక్స్ ల మోత మోగించామని, దీక్షలు చేస్తున్న రైతులపై జీవులెక్కించామని, ఆర్మీ ఉద్యోగులను కాల్చి చంపామని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి రూపాయ పతనం అవ్వడానికి కారణం మా అసమర్థత అని చెప్పాలన్నారు. దుబ్బాకలో మూడు సార్లు డిపాజిట్ కోల్పోయి, సోలిపేట రామలింగారెడ్డి గారి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్లతో గెలిచిన కు మా నర్సంపేట అభివృద్ధిపై ప్రశ్నించే హక్కు ఎక్కడిదని ఈ సందర్భంగా పెద్ది ప్రశ్నించారు.
నా ప్రశ్నలకు సమాధానం చెప్పు..
RELATED ARTICLES
Recent Comments