కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదు..
తేల్చి చెప్పిన కేంద్రం
స్పాట్ వాయిస్, బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర నీటి జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు లేవని కేంద్ర జలశక్తి తెలిపింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈమేరకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు ఉంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Recent Comments