Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుజయశంకర్ జిల్లాలో కన్నుల పండుగగా బీరన్న బోనాలు

జయశంకర్ జిల్లాలో కన్నుల పండుగగా బీరన్న బోనాలు

ఉత్సవాల్లో పాల్గొన్న జీఎస్సార్

స్పాట్ వాయిస్, గణపురం: మండలంలోని గాంధీనగర్ గ్రామంలో గొల్లకురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరన్న బోనాల జాతరలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజక వర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గొల్ల కురుమ కులస్తులకు బీరన్న బోనం ఎంతో విశిష్టమైనదని అన్నారు. తాము కోరిన కోర్కెలు నెరవేర్చాలని పిల్లా పాపలను సల్లగా చూడాలని వేడుకున్నారు. అంతకుముందు కురుమ కుల కులస్తుల పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు బోనాలతో తరలి వచ్చారు. దీంతో, గాంధీ నగర్ రోడ్లు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత సుధాకర్, నాయకులు భువన సుందర్, కాల్వ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments