సీఎం ఏరియల్ సర్వే క్యాన్సిల్..
రోడ్డు మార్గం లోనే నష్టతీవ్రత పరిశీలన
వాతావరణం అనుకూలించకపోవడంతో నిర్ణయం ..
స్పాట్ వాయిస్ , ఓరుగల్లు: గోదావరి బెల్ట్ లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే రద్దు అయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ఆదివారం ఉదయం నుంచి ముసురు పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే భారీ వర్షాలు, వరద ల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రోడ్డుమార్గాన బయలు దేరారు. హన్మకొండ లోని కెప్టెన్ ఇంటి నుంచి ఉదయం 8గంటలకే ప్రత్యేక వాహనం లో వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ఏటూరునాగారం మీదుగా భద్రాచలానికి రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Recent Comments