స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ దవాఖానాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బూస్టర్ డోస్‌కి సంబంధించి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి మంత్రి హరీశ్ రావు మూడు సార్లు లేఖ రాయగా.. ఎట్టకేలకు ప్రభుత్వ చొరవ ఫలించినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. 18 ఏళ్లుపై బడి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 75 రోజుల పాటు జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికి బూస్టర్ డోస్ ఇచ్చేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
Recent Comments