Saturday, April 5, 2025
Homeకెరీర్ఎంసెట్ మెడికల్, అగ్రి ఎగ్జామ్స్ వాయిదా

ఎంసెట్ మెడికల్, అగ్రి ఎగ్జామ్స్ వాయిదా

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఎంసెట్‌ మెడికల్‌, అగ్రికల్చర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల వల్ల గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అయితే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్‌ నిర్వహిస్తే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎంసెట్‌ మెడికల్‌ అగ్రికల్చర్‌ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments