Tuesday, February 25, 2025
Homeజిల్లా వార్తలునర్సంపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నర్సంపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మరో రెండు రోజులు భారీ వర్షాలు.
అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దు…
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా రానున్న 48 గంటల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ
భారీ వర్షాలతో నియోజకవర్గంలో పలు చోట్ల వాగులు, వంకలు, వరద నీటిలో పోటెత్తుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ రెండు రోజులు ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా సెలవులపై వెళ్లొద్దని ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వాగులు, వంకలు నిండుకుండలా ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన వైద్య సేవలు అందించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments