కాకతీయ సప్తాహం ముగింపు వేడుకలు వాయిదా..
స్పాట్ వాయిస్,గణపురం : జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నెల 12 న గణపురం మండలం కోటగుళ్లో నిర్వహించనున్న కాకతీయ వైభవ సప్తహం వేడుకలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యలో జిల్లా పాలనా యంత్రాంగమంతా వరద సహాయక నివారణ చర్యల్లో పాల్గొననున్నారని, అందువల్లే వేడుకలను వాయిదా వేసినట్లు తెలిపారు. కళాకారులు, కవులు, ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలని, హెడ్ క్వార్టర్ లో అధికారులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం ఉంటేనే ఇళ్లలో నుండి బయట రావాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తహసీల్దార్లకు ఆయన సూచించారు.
Recent Comments