Tuesday, February 25, 2025
Homeజనరల్ న్యూస్వార రాశిఫలాలు..

వార రాశిఫలాలు..

వార రాశిఫలాలు

(10-07-2022 to 16-07-2022)
మేషం
భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
వృషభం
సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం
అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూవివాదాలు సమసిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. ఆలయ దర్శనాలు తీసుకుంటారు.
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
సింహం
అనారోగ్య సూచనలు ఉన్నవి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
కన్య
చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
తుల
నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
వృశ్చికం
స్థిరస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
ధనుస్సు
బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
మకరం
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
కుంభం
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
మీనం
నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments