ఈటల సంచలనం నిర్ణయం..
సీఎంపై ప్రత్యక్ష పోరుకు సై
గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటన
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నారు. సీఎం ఇలాకా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ముందే చెప్పానన్న ఈటల.. ఇందుకోసం గజ్వేల్లో సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయం వెల్లడించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల పేర్కొన్నారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి దృశ్యం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని తెలిపారు. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలన్నారు.
బిగ్ న్యూస్…
RELATED ARTICLES
Recent Comments