నిధుల లేమితో ఆగిన రైతు బంధు..!
స్పాట్ వాయిస్,మల్హర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధును నిధుల కొరత వేధిస్తుంది. నిధులు సర్దుబాటు కాక 2022- వానాకాలం పంట సీజన్ రైతు బంధు ఆలస్యంగా జూన్ 28 వ తేదీ నుంచి ప్రారంభించి ఆరోహణ క్రమంలో మొదట ఎకరం లోపు భూమి ఉన్న వారికి మొదలు కొని రోజుకు ఒక ఎకరా పెంచుకుంటూ పోతూ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. జూన్ 30 తేదీన మూడు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం జూలై 1 వ తేదీన నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా జూలై 1వ తేదీన కొంత మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యాయా. మరి కొంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. జూలై 2 నుంచి సోమవారం వరకు రైతు బంధు పంపిణీ అనధికారికంగా నిలిచిపోయింది. టెక్నికల్ సమస్యలు అని అధికారులు చెబుతున్నా.. నిధుల లేమీ ప్రధాన సమస్యగా కనపడుతుంది. నాలుగు ఎకరాల నుంచి పైకి ఉన్న వాళ్లకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ వ్యవసాయ శాఖ నుంచి కానీ డబ్బులు జమ అయినట్టు ఎటువంటి మెసేజ్ లు రాకపోవడం ,బ్యాంక్ ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Recent Comments