గురుకులంలో 16మందికి కరోనా
ఆందోళనలో తల్లిదండ్రులు
స్పాట్ వాయిస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 10 నెలల తర్వాత కరోనా మళ్లీ విజృంభించింది. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంటోంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 16 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఒకే రోజు 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాఠశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 16 మందికి నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన విద్యార్థులను హోం క్వారంటైన్‌కు తరలించారు.
గురుకులంలో 16మందికి కరోనా..
RELATED ARTICLES
Recent Comments