Saturday, November 23, 2024
Homeజాతీయంమహారాష్ర్ట సీఎంగా ఏక్ నాథ్ షిండే

మహారాష్ర్ట సీఎంగా ఏక్ నాథ్ షిండే

వీడిన ‘మహా’ ఉత్కంఠ
స్పాట్ వాయిస్, బ్యూరో: మహా ఉత్కంఠ వీడింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న హై డ్రామాకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం రాత్రి 7.30గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోశ్యారీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సీఎంగా షిండే మాత్రమే ప్రమాణం చేస్తారని ప్రకటించారు. మంత్రివర్గం విషయంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తొలుత సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా.. షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments