కూలిన మహారాష్ట్ర సర్కారు
సీఎం పదవికి రాజీనామా చేసిన ఠాక్రే
స్పాట్ వాయిస్, డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు. ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్.. తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.శివసేన రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్ధవ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఏక్‌నాథ్ శిందే వైపు మెజార్టీ సభ్యులు ఉండడంతో ఉద్ధవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సీఎం పదవికి ఠాక్రే రాజీనామాతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి
Recent Comments