Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుతల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకు.. తల్లి ఏం చేసిందంటే ?

తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకు.. తల్లి ఏం చేసిందంటే ?

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన కొడుకే కన్న తల్లిదండ్రులపై దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండెల సంపత్ అనే ఫ్లంబర్ వర్కర్ మద్యానికి బానిసై డబ్బుల కోసం కొద్ది రోజులగా తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 22న మరోసారి దాడి చేయడంతో విసిగి వేసారిన తల్లి వనక్క గణపురం పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు సంపత్ తాగుడుకు బానిసై ఏ పని చేయకుండా ఉండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, దీంతో తన కొడుకు రోజూ మద్యం తాగి డబ్బుల కోసం వేధిస్తున్నాడని, ఇవ్వకుంటే తమపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే కుమారుడు సంపత్ వల్ల ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు బాధితురాలు కోరింది. దీంతో కేసు నమోదు చేసి సంపత్ ను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments