రంగు, డిజైన్ ను మార్చిన సర్కారు..
ఆగస్టు 15 వరకు అందేలా చర్యలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫాం కలర్ తోపాటు డిజైన్ మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ కొత్త యూనిఫాంలను అందజేయనున్నారు. గతంలో నీలం రంగు చొక్కా, సిరా రంగు నిక్కరును విద్యా శాఖ విద్యార్థులకు అందజేసింది. ఈ సారి తెల్ల వస్త్రంపై ఎరువు రంగు గడులతో కూడిన చొక్కాలు, కాఫీ రంగు నిక్కరు పంపిణీ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు 15వరకు రెండు జతల యూనిఫాంలు అంజేయనున్నారు. అందుకు అవసరమైన 1.40 కోట్ల మీటర్ల వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో) సరఫరా చేయనుంది. అయితే మొదటి విడతలో ఒక్కో విద్యార్థికి ఒక జత చొప్పున అందజేసి, ఆ తరువాత మిగతా యూనిఫాం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా యూనిఫాంలు అందజేసేందుకు అవసరమైన క్లాత్ ఇప్పటికే కొన్ని మండల కేంద్రాలకు చేరుకున్నట్లు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు
Recent Comments