Wednesday, April 16, 2025
Homeక్రైమ్జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు ఆత్మహత్య

వెంటాడిన అప్పులు..అనారోగ్యం

స్పాట్ వాయిస్, గణపురం: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గోనె రాజశేఖర్ (36) గత సంవత్సరం తనకున్న ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పంట వేశాడు. వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. ఇంకో వైపు ఆరోగ్యం సహకరించక పోవడం వల్ల అప్పుల పాలయ్యాడు. (స్పాట్ వాయిస్, గణపురం) అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఈ విషయంపై భార్యాభర్తలకు తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భార్య రమ పుట్టింటికి వెళ్లిది.  దీంతో ఒంటరిగా ఉన్న రాజశేఖర్ మనస్తాపానికి గురై సోమవారం తను కిరాయి ఉంటున్న ఇంట్లోని రేకుల షెడ్డుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన కొందరికి రాజశేఖర్ ఉరివేసుకొని కనబడటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments