మేడ్చల్ ఫస్ట్.. హన్మకొండ సెకండ్
ఫస్టియర్‌లో 63.32 శాతం
సెకండ్ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహించనున్నారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు.
ఫలితాల కోసం
https://tsbienew.cgg.gov.in/,
https://results. cgg.gov.in,
https://examresults.ts.nic.in లో చూసుకోవచ్చు
Recent Comments