రుద్రారం బ్రిడ్జి పై పులి సంచారం నిజం కాదు..
సోషల్ మీడియాలో వస్తున్న మీడియా లో వస్తున్న వీడియో ఫేక్
తేల్చి చెప్పిన కొయ్యూరు రేంజ్ అటవీ అధికారులు
స్పాట్ వాయిస్,మల్హర్: మల్హర్ మండలంలోని రుద్రారం కొయ్యూరు ప్రధాన రహదారి పై బ్రిడ్జి మీద సోమవారం ఉదయం పులి సంచరించింది అని సోషల్ మీడియా లో సర్కులేట్ అవుతున్న వీడియో ఫేక్ వీడియో అని అటవీ అధికారులు తేల్చారు. ఉదయం నుండి వీడియో వైరల్ కావడం తో కొయ్యూరు రేంజి అటవీ అధికారులు రుద్రారం, ఎడ్లపల్లి ,కొయ్యూరు ,శత్రాజ్ పల్లి రహదారులపై ఉన్న బ్రిడ్జి లని పరిశీలించారు.వీడియో లో ఉన్న బ్రిడ్జి కి వాస్తవ బ్రిడ్జి లకి ఏ మాత్రం సంబంధం లేదు అని తెలిపారు.శనివారం రాత్రి భూపాలపల్లి నుండి మల్హర్ అడవుల్లోకి పులి ప్రవేశించింద అని బస్ డ్రైవర్ చెప్పిన మాటల ప్రకారం మల్హర్ అడవులలో పులి పాద ముద్రల కోసం వెతుకుతున్నాము అని,ప్రజలు కూడా అప్రమత్తం గా ఉండాలని పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, పుకార్లు ప్రచారం చేయవద్దని వారు కోరారు.
పులి సంచారం వీడియో ఫేక్..
RELATED ARTICLES
Recent Comments