Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ అన్నకు ఉద్యోగం..

సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ అన్నకు ఉద్యోగం..

సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ అన్నకు ఉద్యోగం..

వరంగల్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన సీఎస్
స్పాట్ వాయిస్ , హైదరాబాద్: రైల్వే స్టేషన్ కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ సోదరుడు రాజుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వరంగల్ కలెక్టర్ బీ గోపిని ఆదేశించారు. ఈనెల 17న సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజు కు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యార్హతలకనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాలని వరంగల్ కలెక్టర్ గోపి ఆదేశిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments