స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. ఏడు రోజులు కవితకు ఈడి కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత కేసుకు సంబంధించిన వాదనలు విన్న సీబీఐ స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ రిమాండ్ కు ఇస్తూ తీర్పునిచ్చారు. ఇక కవిత తరఫు లాయర్లు ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని వాదనలు వినిపించారు. ఈ అరెస్ట్ అక్రమమని, కస్టడీకి ఇవ్వొద్దని న్యాయవాదులు కోరారు.
Recent Comments