Friday, November 22, 2024
Homeజనరల్ న్యూస్రూ.500ల గ్యాస్ మీకు వర్తిస్తుందా..?

రూ.500ల గ్యాస్ మీకు వర్తిస్తుందా..?

ఇవిగో మార్గదర్శకాలు..
స్పాట్ వాయిస్, డెస్క్: తెలంగాణ ప్రజలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ రూ.500లకే గ్యాస్​ సిలిండర్​అందిస్తోంది. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారులు మూడేళ్లలో వాడిన గ్యాస్​ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకొని ఆమేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.500లకు గ్యాస్​ సిలిండర్​ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతగా మూడు ప్రమాణాల్ని నిర్దేశించింది.
* తెలంగాణలో తెల్లరేషన్​ కార్డు కలిగి ఉండాలి.
* తెల్లరేషన్​ కార్డు ఉండి వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్​ కనెక్షన్​ ఉండాలి.
*డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్​ కోసం దరఖాస్తు చేసి ఉండాలి.
ఈ పథకంలో వినియోగదారులు తొలుత సిలిండర్​కు పూర్తి అమౌంట్ చెల్లించాలి. వారికి ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ రాయితీని ఆయిల్ కంపెనీలు లబ్ధిదారు బ్యాంకు అకౌంట్ లో వేస్తారు. ఈ పద్ధతి ప్రస్తుతం పైలట్​ విధానంలో అమలవుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments