Friday, November 15, 2024
Homeజిల్లా వార్తలుత్వరపడండి.. ఆస్తి పన్ను 5శాతం తగ్గింపు..

త్వరపడండి.. ఆస్తి పన్ను 5శాతం తగ్గింపు..

30 లోగా ఆస్తి పన్ను చెల్లించండి..
గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
స్పాట్ వాయిస్, కార్పొరేషన్ : ఈనెల 30 తేదీలోగా 2022 -23 సంవత్సరానికి అడ్వాన్సుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రిబెట్ పొందాలని గ్రేటర్ కమిషనర్ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ పురపాలికల చట్టము 2019 సెక్షన్ 100 లో తెలిపిన ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెల 30 లోగా చెల్లిస్తే ఆస్తి పన్ను పై ‘ఎర్టీ బర్డ్’ స్కీం కింద 5 శాతం రిబేటు ఇవ్వబడుతుందన్నారు. మహా నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులందరు, గృహాలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు, ప్రస్తుత సంవత్సరపు ఆస్తి పన్నును మొత్తంగా 30లోగా చెల్లించి, ప్రస్తుత సంవత్సరపు ఆస్తి పన్ను పై రాయితీ పొందాలని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కమిషనర్ ప్రావీణ్య కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments