Monday, May 19, 2025
Homeతెలంగాణరాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు..

రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు..

ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో మరో ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. సోమవారం పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. మంగళవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడే చాన్స్‌ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. అలాగే, గురు, శుక్ర వారాల్లోనూ ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments