అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: పశ్చిమ – మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత అల్పపీడనంతో పోలీస్తే దీని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఇక సెప్టెంబర్ మాసంలో గత పదేళ్లలో ఈ ఏడాదే అత్యంత వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారిణి శ్రావణి తెలిపారు. శీతోష్ణస్థితి పరిస్థితుల్లో చాలు మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ఒకేసారి అధిక వర్షపాతం నమోదవ్వడం, సుదీర్ఘ విరామం వంటి పరిస్థితులు శీతోష్ణస్థితి వల్ల ఏర్పడుతున్నట్లు తెలిపారు.
ఐదు రోజులు వానలే..
RELATED ARTICLES
Recent Comments