Monday, April 7, 2025
Homeజిల్లా వార్తలుమల్లికార్జునస్వామికి 40 కిలోల వెండి బహూకరణ

మల్లికార్జునస్వామికి 40 కిలోల వెండి బహూకరణ

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: ఐనవోలు మల్లికార్జునస్వామి ముఖ ద్వారానికి, ధర్వాజకు సుమారు 40 కిలోల వెండితో తొడుగు తయారు చేసిన దాతలు శ్రీ పర్ష సర్వేశ్వర్ రావు యాదవ్, కౌసల్య దంపతులు ఆదివారం దేవాలయంలోని గణపతికి కిలో వెండితో కిరీటం, హస్తాలు, తొండము చేయించారు. వాటిని దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, దేవాలయ ఉప ప్రధాన అర్చకుడికి అందజేశారు. అలాగే దేవాలయ ఆవరణలోని ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు శ్రీ పర్ష సర్వేశ్వర్ రావు యాదవ్, కౌసల్య దంపతులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాత పర్షా సర్వేశ్వర్ రావు యాదవ్ కూతురు జి. వనజ యాదవ్, అల్లుడు పవన్ రాజ్ యాదవ్ అర్చకులు,ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments