వరద బాధితులకు అండగా జీఎంఆర్ఎం ట్రస్ట్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: భూపాలపల్లి మండలం మోరంచపల్లి వరద బాధితులకు జీఎంఆర్ఎం ట్రస్ట్ అండగా నిలిచింది. రూ.10 లక్షల విరాళాన్ని బాధిత కుటుంబాలకు వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జీఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి, గండ్ర భూపాల్ రెడ్డి, గండ్ర అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రతీ ఇంటికి రూ.4 వేల చొప్పున అందజేశారు. ప్రతి కుటుంబానికి తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్ పర్సన్ కళ్లెపు శోభా రఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్య-విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి సెగ్గం వెంకటరాణి సిద్ధూ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు కరాటే శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments