లిక్కర్ స్కాంలో కవితను విచారిస్తున్న సీబీఐ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు దాదాపు 4 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఈ కేసులో కవిత స్టేట్ మెంట్ను రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మహిళా అధికారులతో సహా మొత్తం 11మంది అధికారులు కవిత నివాసానికి వచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రత్యేక గదిలో ఆమెను విచారిస్తున్నారు.మొదట అడ్వకేట్ సమక్షంలో స్టేట్ మెంట్ ను ఎమ్మెల్సీ కవిత ఇవ్వగా.. మధ్యాహ్నం తర్వాత సీబీఐ అధికారులు అడ్వొకేట్ను బయటకు పంపినట్లు తెలుస్తోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
4 గంటలుగా విచారణ
RELATED ARTICLES
Recent Comments