స్పాట్ వాయిస్, హన్మకొండ: రాష్ట్రంలో మూడు రోజులపాటు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, తుపానుగా బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగునుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 6 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది.వాయువ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా, రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఏపీలోనీ విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,140 కి.మీ., పూరీ (ఒడిసా)కి దక్షిణ ఆగ్నేయంగా 1,180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా, సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Recent Comments