Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలు31వ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా...

31వ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా…

ఆదర్శ డివిజన్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యం
31 వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: గ్రేటర్ వరంగల్ పరిధి లోని 31 వ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలో రూ.5 లక్షలతో నిర్మించనున్న బతుకమ్మ కుంట, రజక కులస్తుల శ్మశాన వాటికను, రూ.50 లక్షలతో దుర్గాదేవి కాలనీ నుంచి సీఎస్ఆర్ జంక్షన్ వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ రాజు యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల వసతులతో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అధికారుల సహకారాలతో డివిజన్ లో అపరిశుభ్రతకు తావు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రజక కుల సంఘం అధ్యక్షుడు నీరటి భిక్షపతి, నాయకులు కొల్లూరి భిక్షపతి, శ్రీనివాస్, కాంట్రాక్టర్ లింగారావు, వర్కింగ్ ఇన్ స్పెక్టర్ రమేష్, బాబురావు, ప్రసాద్, కిరణ్, కొమురయ్య, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments