ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భానుడి భగభగలు, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రాగల మూడు రోజులు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు పగటిపూట ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచించారు.
జూన్ మధ్యలో ఉన్నా..
జూన్ నెలలో 18రోజులు గడిచినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం 8 గంటలు దాటిందంటే ఎండ మండిపోతోంది. ఉక్కబోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా.. ఎండ భయానికి తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపించే సహసం చేయడం లేదు.
Recent Comments