ఆదుకోవాలని రైతు వేడుకోలు
కేసముద్రంలో ఘటన
స్పాట్ వాయిస్ కేసముద్రం: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని ఓ పౌల్ట్రీ రైతుకు చెందిన కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బెజ్జం సమ్మయ్య తన వ్యవసాయ భూమిలో బాయిలర్ కోళ్ల ఫామ్ నిర్మించుకున్నాడు. అందులో వెంకటేశ్వర హ్యాచరీస్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని ఇంటిగ్రెషన్ పద్దతిలో కోడిపిల్లలను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆదివారం కేసముద్రం చెరువు నిండుకోవడంతో వరద నీరు చెరువు కింది ప్రాంతానికి చేరింది. ఈ క్రమంలో ఆ వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో సమ్మయ్య కోళ్ల ఫామ్ మీదుగా ప్రవహించింది. దీంతో సమ్మయ్య కు చెందిన సుమారు 2600 కోళ్లు మృత్యువాత పడ్డాయి. షెడ్డులో ఉన్న 12 బస్తాల దాన కూడా పూర్తిగా తడిసిపోయినట్లు రైతు తెలిపారు. తనను ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు.
వరద నీటికి 2600 కోళ్లు మృత్యువాత
RELATED ARTICLES
Recent Comments