Friday, May 2, 2025

నైతిక విలువలు పెంపొందించడానికే ‘బాలగోకులం‘
ప్రొఫెసర్ చిలుకమారి సంజీవ
వేసవి ఉచిత శిక్షణ ప్రారంభోత్సవం

స్పాట్ వాయిస్, హనుమకొండ: బాల, బాలికల్లో నైతిక విలువలు పెంపొందించడానికే ‘బాలగోకులం’ పేరుతో వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘచాలక్ ప్రొఫెసర్ చిలుకమారి సంజీవ అన్నారు. మాధవ స్మారక సమితి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం ‘బాలగోకులం’ ను ఆయన గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ స్మారక సమితి అధ్యక్షుడు డాక్టర్ కోదాటి సుధాకర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ చిలుకమారి సంజీవ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. పది నెలలపాటు చదువులో నిమగ్నమైన బాల, బాలికలు వేసవి సెలవులను ఆహ్లాదకరంగా గడపడానికి ఈ శిక్షణా శిబిరం దోహదపడుతుందన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి, పెద్దలపట్ల గౌరవం, మానవీయ విలువలతో పాటు, స్వదేశీ ఆటలు, యోగ, ఆసనాలు, సంస్కృతం, పద్యం నేర్చుకోవడం లాంటి విషయాలతో పాటు అందమైన చేతిరాత రాయడం, చిత్రలేఖనంపై ఈ శిబిరం ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనేక తెలియని విషయాలు ఈ వేసవి శిబిరంలో బాల,బాలికలు తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వరంగల్ మహానగర్ సంఘ చాలక్ డాక్టర్ బందెల మోహన్ రావు, మాధవ స్మారక సమితి సభ్యులు వుట్కూరు మనోహర్, లెక్కల జలంధర్ రెడ్డి, దాస్యం రామానుజం, బాలగోకులం నిర్వాహకులు ఆర్.లక్ష్మణ్ సుధాకర్, సత్తు రామనాథం, ప్యాట శ్రీనివాస్, మేరుగు అనురాధ, కుందారపు చక్రధర్, శిక్షణకు వచ్చిన బాల,బాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments