Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఫాం హౌజ్ నిందితులకు 14 రోజుల రిమాండ్

ఫాం హౌజ్ నిందితులకు 14 రోజుల రిమాండ్

ఫ్లాష్.. ఫ్లాష్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల నవంబరు 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే రిమాండ్‌ను ఆపాలని నిందితుల తరఫు న్యాయవాది రామారావు కోరారు. ఈ అభ్యర్థనను ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని తిరస్కరించారు. అంతకుముందు నిందితులను ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సైబరాబాద్ కమిషనరేట్ కు తరలించారు. అక్కడి నుంచి మొయినాబాద్ పీఎస్ కు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి నిందితుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం వారిని నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ ను ఆపాలంటూ నిందితుల తరఫు న్యాయవాది రామారావు వాదనలు వినిపించారు. వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. నిందితులకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments