9.37 నిమిషాలకు వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ బెడద వీడటం లేదు. టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ ఇష్యూ ముగియక ముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం రేపుతోంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30కు పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్ష మొదలైన ఏడు నిమిషాలలోపే అంటే 9:37 గంటలకే ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. పకడ్బందీగా నిర్వహించాల్సిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ తాండూరు వాట్సాప్ సోషల్ మీడియాల గ్రూప్‌లలో ముందే చెక్కర్లుకొట్టింది. ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పేపర్ మనది కాదంటూ బుకాయించారు. అయితే పరీక్షా సమయం అయిపోయిన తర్వాత 12:30 గంటలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి వచ్చింది. అయితే ప్రశ్నాపత్రం లీకేజ్‌పై వికారాబాద్ డీఈవో వివరణ ఇచ్చారు. తమ జిల్లాలో ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ అవలేదని చెబుతున్నారు.
టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్
RELATED ARTICLES
Recent Comments