ఎమ్మార్పీఎస్ దీక్షలకు టీఆర్ ఎస్ సంఘీభావం
స్పాట్ వాయిస్, వరంగల్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పీ కుమార్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడ యెలుగం సత్యనారాయణ, కార్పొరేటర్ మరుపల్ల రవి దీక్షా శిబిరాన్ని సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉందని, వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరికీ దశలవారీగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ ఎస్సీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ యూత్ నాయకులు భాషకర్ల హరిక్రిష్ణ పటేల్, మరుపల్ల గౌతమ్, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు, వికలాంగుల పోరం సభ్యులు, జూపాక సురేష్, అంబాల మహేష్, రహీం, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ దీక్షలకు టీఆర్ ఎస్ సంఘీభావం
RELATED ARTICLES
Recent Comments