ఉత్తర్వులు జారీ చేసి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: పల్లెల్లోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలందించిన ‘104’ కనుమరుగవుతోంది. ‘104’ సంచార వాహనాలు ప్రతీ గ్రామానికి వెళ్లి షుగర్, బీపీ, ఇతర వ్యాధిగ్రస్తులకు నెలనెలా పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను ఉచితంగా అందించేది. ఈ సేవలు చాలా రోజులుగా బంద్ అయ్యాయి. ఈ క్రమంలో 104 వాహనాలకు వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. ఈమేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 198 వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకోసం కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని నియమించింది. 104 వ్యవస్థ ద్వారా సేవలు నిలిచిపోగా.. వినియోగం లేకపోవడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఈ వ్యవస్థలోని 1,250 మంది వైద్య సిబ్బందిని ఇతర సేవలకు వినియోగించే దిశగా కసరత్తు చేస్తున్నారు.
Recent Comments