Saturday, September 21, 2024
Homeక్రైమ్పోక్సో కేసులో నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష

రూ.10వేల జరిమానా
తీర్పునిచ్చిన భూపాలపల్లి డిస్టిక్ కోర్టు జడ్జి
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: బాలికపై లైంగికదాడి ఘటనలో నిందితుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానాను భూపాలపల్లి డిస్టిక్ కోర్టు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన లైంగికాదాడి కేసులో ఎస్సై బి. అనిల్ కుమార్ కేసు నమోదు చేయగా.. సీఐ ఎమ్. సాయి రమణ దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్ చేశారు. పీపీ విష్ణువర్ధన్ రావు కేసు వాదించగా సోమవారం భూపాలపల్లి డిస్ట్రిక్ట్ జడ్జి నారాయణ బాబు శిక్ష విధించారు. లైసన్ ఆఫీసర్ వెంకన్న, పోక్సో కోర్టు సీడీఓ పీ శ్వేత కృషితో నిందితునికి శిక్ష పడింది. సాక్షులను సరైన టైమ్ లో కోర్టులో హాజరుపరిచిన కోర్టు ఆఫీసర్లను చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments