Saturday, April 19, 2025
Homeలేటెస్ట్ న్యూస్కుసుమ జగదీశ్ కుటుంబానికి రూ.1.50 కోట్లు అందజేత

కుసుమ జగదీశ్ కుటుంబానికి రూ.1.50 కోట్లు అందజేత

స్పాట్ వాయిస్, ములుగు: దివంగత మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలిచింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన కోటి 50 లక్షల చెక్కును సోమవారం ములుగు జిల్లా మల్లంపల్లిలోని జగదీష్‌ స్వగృంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. పిల్లల చదువులతో పాటు వారి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు కుసుమ జగదీశ్ చిత్రపటానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ.ప్రకాశ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడేనాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments